Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోలిస్టిక్ ఆస్పత్రిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- దట్టంగా అలముకున్న పొగలు
- లోపల చిక్కుకున్న పేషెంట్లు, ఊపిరాడక అవస్థలు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
కూకట్పల్లి సర్కిల్, హైదర్ నగర్ డివిజన్ పరిధిలో నిజాంపేట్ వెళ్లేరోడ్డులోగల హోలిస్టిక్ ఆస్పత్రిలో సోమవారం రాత్రి 11 గంటల తర్వాత భారీ అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రిలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఏం జరుగుతుందో తెలియక లోపల పేషెంట్లు, బయట ఉన్న రోగుల బంధువులు హాహాకారాలు చేశారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో నాలుగు ఫైర్ ఇంజన్లు వెంటనే చేరుకుని మంటలను ఆర్పేపనిలో నిమగమయ్యాయి. ఆస్పత్రిలో లోపల 70 నుంచి 80 మంది వరకు పేషెంట్లు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. సహాయక చర్యల ద్వారా, అద్దాలు, కిటికీలు పగులగొట్టి బయటకు తీసిన పేషెంట్లను ఇతర ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో నని రోగుల బంధువుల ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి ఆస్పత్రిక నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, పేషెంట్ల బంధువుల చెప్తున్నారు. రన్నింగ్లో ఉన్న ఆస్పత్రిలో రీకన్స్ట్రక్షన్ పనులు చేపట్టారనీ, వాటర్, కరెంట్ సప్లరు కూడా సరిగ్గా లేదని తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలిసి రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కూడా ఘటనా స్థలికి చేరుకు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణనష్టం గురించిన సమాచారం ఇంకా తెలియాల్సిఉన్నది.