Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం సహకరించడం లేదు
- వాగ్ధానాలను నిలబెట్టుకోవాలి.... రాయితీలు ఇవ్వాలి
- హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాడుతాం : డ్రిల్మెక్ స్పాతో ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే తెలంగాణ నాలుగో అతి పెద్ద ఆర్థిక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి మాత్రం సహకారం అందడం లేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్ రంగంలో అంతర్జాతీయంగా పేరున్న హైడ్రోకార్బన్ సంస్థ (మెఘా ఇంజినీ రింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధం)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్ర మంలో మంత్రి మాట్లాడుతూ మంగళవారం ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్లో గతంలో తెలంగాణకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రధాని నరేంద్రమోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నా....రాష్ట్రాలకు నిధులివ్వకుండా అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఏడున్నరేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్రానికి, కేంద్ర సహకారం అవసరాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి ప్రపంచస్థాయి సంస్థలు తరలిరావ డం సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి ఈ సందర్భంగా అభివర్ణించారు. రూ.1500 కోట్లు పెట్టుబడితో ముందుకొచ్చిన డ్రిల్మెక్ స్పా మ్యూన్యుఫాక్చర్ గ్లోబల్ హబ్‌తో 2,500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇందులో80 శాతం వరకు స్థానికులకే దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రిల్మెక్ స్పా కంపెనీ పెట్టుబడితో, ఆయిల్ రిగ్గుల తయారి గ్లోబల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన వనరులను సమకూర్చడంతో పాటు ప్రోత్సాహకాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర డ్రిల్లింగ్ వ్యవస్థలో ఉండే కంపెని లను కూడా తెలంగాణకు తీసుకురావలని డ్రిల్మెక్ స్పా సీఈఓ సిమోన్ ట్రెవిసానిని కోరారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖతో డ్రిల్మెక్ స్పా చేసుకున్న అవగాహనా ఒప్పందంపై రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఈఓ సిమోన్ ట్రెవిసానిలు సంతకాలు చేశారు.
ఈ సందర్బంగా ట్రెవిసాని మాట్లాడుతూ,ఈ డ్రిల్లింగ్ రిగ్గుల తయారీ యూనిట్ దేశంలో ఇంధన భద్రతకు భరోసా ఇస్తుందని తెలిపారు. పెట్టుబడులకు,పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో అనుకూల వాతావరణ ం ఉందని అభిప్రాయపడ్డారు.భవిష్యత్తు లో హైడ్రోజన్ ఇంధన ప్రాజెక్ట్‌ని భారత్‌కు తీసుకొస్తామని ప్రకటించారు. డ్రిల్మెక్ ఇంటర్నేషనల్ సీఈఓ ఉమా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నాణ్యత గల మానవ వనరులను తీర్చిదిద్దుతామని తెలిపారు.