Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన
- ఎన్నికలపై సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామనీ, పక్కాగా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అవసరమైతే తాను ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రగతిభవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిపథంలో నడుస్తుందన్నారు. గతే డాది రూ. లక్షా 51వేల కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ. లక్షా 80వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్‌పై బీజేపీ దొంగ సోషల్ మీడియా క్షుద్ర నీతి అని కొట్టిపారేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేక చట్టం చేసి ఫిబ్రవరి నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
317 జీఓ అద్భుతం:సీఎం కేసీఆర్
ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలు రూపొందిస్తూ తీసుకొచ్చిన జీఓ నెంబర్ 317 అద్భుతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఎక్కడ ఉన్నో ళ్లం అక్కడ నుంచి కదలమనే స్వార్ధపరులైన ఉద్యోగులు కొంతమందే దాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు వారి సొంత జిల్లాలో ఉద్యోగం రావద్దా..? కొత్త జిల్లాలు చేసుకుంది ముద్దు పెట్టుకో వడానికా..? మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ కావద్దా..? అని సీఎం ప్రశ్నించారు.రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది ఉద్యోగులు బది లీ అయితే 57మంది మాత్రమే రిపోర్టు చేయలేదనీ, వారి కోసం ఉద్య మం చేస్తామని బీజేపీ నాయకులు అనడం హాస్యాస్పదమన్నారు. తెలం గాణలో ఆ పార్టీనే లేదన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో ఒకటి రెండు తప్ప మరెక్కడా డిపాజిట్లు కూడా రాలేదని చెప్పారు.