Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బక్క జడ్సన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళిత బంధు అమలులో కాలయాపన నివారించాలంటూ హైకోర్టును ఆశ్రయించినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్క జడ్సన్ తెలిపారు. హైదరాబాద్లో వరద సహాయం ఆగినట్టే దళిత బంధు ఆగిపోతుందని కోర్టుకు తెలిపామన్నారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిందని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధులు 70వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంత అన్యాయం జరుగుతుంటే మల్లెపల్లి లక్ష్మయ్య, మోత్కుపల్లి నర్సింహులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.