Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీహెచ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు, దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మెన్ వి.హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో ట్రస్ట్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పక్షాన ఫిబ్రవరి 14న ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.