Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల వేతనం పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వీ మంగళవారం జారీ చేశారు. ప్రస్తుతం వారు నెలకు పొందుతున్న వేతనాన్ని రూ.17 వేల నుంచి రూ.21 వేలకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ల్యాబ్ టెక్నీషియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.