Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైజీరియన్ టోనీ నుంచి మాదకద్రవ్యాలు కొన్న తొమ్మిది మంది వ్యాపార ప్రముఖులను పోలీసులు విచారించేందుకు కస్టడీకి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. టోనీ డ్రగ్స్ సరఫరా చేస్తే తొమ్మిది మంది కొన్నారనీ, ఆ తర్వాత వాళ్లు ఇంకెవరికైనా సరఫరా చేశారా? లేదా? అని దర్యాప్తు చేసేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. కింది కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని జస్టిస్ లక్ష్మణ్ చెప్పారు. డ్రగ్స్ వినియోగ ఆరోపణలు నిరూపితమైతే 6 నెలలే జైలు శిక్షపడుతుందనీ, ఇంత చిన్న కేసుల్లో పోలీస్ కస్టడీ అవసరం లేదని డ్రగ్స్ వినియోగదారులు, నిందితులుగా ఉన్న నిరంజన్‌కుమార్ జైన్, శశ్వత్జైన్, యగ్యానంద్ అగర్వాల్, దండు సూర్యసుమంత్రెడ్డి, బండి భార్గవ్, చలసాని వెంకట్, తమ్మినేడి సాగర్, అల్గాని సాగర్, గొడి సుబ్బారావు తరఫు న్యాయవాదుల వాదనను హైకోర్టు సమర్ధించింది.