Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ కోట్లాదిమంది సామాన్యుల, శ్రమ జీవుల గోడును ఏ మాత్రం పట్టించుకోలేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు విమర్శించారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నిరుద్యోగం, అధిక ధరలు, అసమానతలు, ఉపాధిలేమి సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే వాటిని పరిష్కరించకుండా అన్నింటికీ డిజిటల్ సేవలే సంజీవని అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మొత్తం బడ్జెట్ అంచనా ఖర్చు రూ.39.44 లక్షల కోట్లని చెబుతూ ఆదాయ వనరులుగా రూ.22 లక్షల కోట్లే చూపారని తెలిపారు. మిగిలిన రూ.18 లక్షల కోట్లను పూడ్చుకునేందుకు ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, సామాన్యులపై పన్నుల భారాలను మోపడం దారుణమని విమర్శించారు.