Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సహమివ్వలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈమేరకు మంగళవారం ఆయన బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చి, ఏడేండ్లు అయినా ఆ ఊపే ఎత్తలేదని పేర్కొన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తామనీ, పంట రకాలను అభివృద్ధిని చేస్తామని చెప్పిందనీ, ఆ దిశగా బడ్జెట్లో నిధులు చూపించలేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర విధానాలు ఇలా ఉంటే రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేది ఎప్పుడు అని ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్ నిరాశే : మంత్రి కొప్పుల ఈశ్వర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు, బలహీన వర్గాలకు నిరాశను మిగిల్చే విధంగా ఉందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఎస్సీ, మైనారిటీ,వికలాంగులు,వయో వృద్ధుల భద్రత, సంక్షేమానికి నయా పైస కేటాయింపులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయా తరగతులకు బీజేపీ వ్యతిరేకమైనదనే విషయం మరోసారి ప్రపంచానికి తేటతెల్లమైందని విమర్శించారు.