Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీ.జీ.నర్సింహారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ పట్టణ ప్రజలకు సంతోషాన్నిచ్చేదిగా లేదని తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి ఫోరం (పట్నం) ప్రధాన కార్యదర్శి డీ.జీ.నర్సింహారావు విమర్శించారు. ఈ బడ్జెట్ పేదలకు, రైతులకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. పట్టణాలకు సరపడినట్టుగా నిధులు కేటాయించలేదని తెలిపారు. 500 అమృత్ నగరాలకు రూ.7,300 కోట్లు కేటాయించారనీ, వీటితో ఒక్కో నగరానికి రూ.15 కోట్లు మాత్రమే వస్తాయని తెలిపారు. కేవలం చెప్పుకునేందుకే అన్నట్టుగా 100 స్మార్ట్ నగరాలకు రూ.6,465 కోట్లు కేటాయిస్తే, అందులో ఒక్కో నగరానికి రూ.64.65 కోట్లు వస్తాయన్నారు. ఎంఆర్ టీఎస్, మెట్రో ప్రాజెక్టులకు రూ.23,875 కోట్లు మాత్రమే ఇచ్చారనీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన అర్బన్ లైవ్లీ మిషన్‌కు రూ.900 కోట్లు మాత్రమే ఇవ్వడం పట్టణ పేదలను నిర్లక్ష్యం చేయడమే అని విమర్శించారు. ఆదాయం తక్కువగా ఉన్న వారి హౌజింగ్ కోసం నిధులివ్వలేదని తెలిపారు. నిటిఅయోగ్ 2025 నాటికి పట్టణ ప్రాంతాల జనాభా 50 శాతం పెరుగుతుందంటూ నివేదించిందని గుర్తుచేశారు. ఆర్థిక మంత్రి ప్రకటించినట్టుగా 2025 నాటికి రూ.48,000 కోట్లతో 80 లక్షల గృహాల నిర్మాణానికి సంబంధించిన కేటాయింపులు హౌజింగ్, పట్టణ బడ్జెట్ లో లేవని తప్పుపట్టారు. అందువల్ల ఈ బడ్జెట్ అభివృద్ధి నిరోధక బడ్జెట్ అని పేర్కొన్నారు.