Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.మొత్తం రూ.26 లక్షల కోట్ల రెవెన్యూ పద్దులో నుంచి గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా..కేవలం 0.02 శాతం మాత్రమే కేటాయించి గిరిజనులను చిన్న చూపు చూసిందని ఆరోపించారు. గతేడాది బడ్జెట్లో రూ.75244 కోట్లు కేటాయించి సవరించిన అంచనాల్లో రూ. 1,343 కోట్లు తగ్గించారని తెలిపారు. ఆ తరువాత రూ. రూ.6181 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేసిందని విమర్శించారు. 2022-23లో రూ.927 కోట్లు పెంచినట్టు చెప్పినప్పటికీ గతంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేసిన దాఖలాల్లేవని గుర్తుచేశారు. తెలంగాణ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయలేమని చెప్పటం అన్యాయమని పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు తనానికి నిదర్శనమని విమర్శించారు.