Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో బడులు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల తర్వాత బడిగంట మోగింది. విద్యాసంస్థల్లో మంగళవారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 55,11,602 మంది విద్యార్థులకుగాను 17,89,809 (32.47 శాతం) మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మంగళవారం వివరాలు ప్రకటించారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సాధారణ గురుకులాలు, ప్రయివేటులో కలిపి మొత్తం 38,307 పాఠశాలలకు 37,590 స్కూళ్లు తెరుచుకున్నాయని వివరించారు. 26,802 ప్రభుత్వ పాఠశాలలన్నీ తెరుచుకున్నాయనీ, 24,05,047 మంది విద్యార్థులకుగాను, 8,17,985 (34.01 శాతం) మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని వివరించారు. 668 ఎయిడెడ్ స్కూళ్లలో 591 పాఠశాలలు తెరుచుకున్నాయనీ, 81,381 మంది విద్యార్థులకుగాను, 21,797 (26.78 శాతం) మంది వచ్చారని తెలిపారు. 10,837 ప్రయివేటు స్కూళ్లకుగాను 10,197 పాఠశాలలు తెరుచుకున్నాయని వివరించారు. వాటిలో 30,25,174 మంది విద్యార్థులకుగాను, 95,00,27 (31.40 శాతం) మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని పేర్కొన్నారు.