Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్ఎస్ఎమ్ఈకి ఏమీ లేదు
- ప్రొక్యూర్మెంట్ చట్టం అమలునూ ప్రస్తావించలేదు: కేంద్ర బడ్జెట్‌పై ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయఅధ్యక్షులు ఏపీకే రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, పునరుత్తేజం కోసం కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి చెప్పారు. ఎమ్ఎస్ఎమ్ఈ మార్కెటింగ్ సహకారం కోసం పోర్టల్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. దీనివల్ల ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి ఒరిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. మార్కెటింగ్ సౌకర్యం కోసం ఎమ్ఎస్ఎమ్ఈ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ ఉన్నదనీ, దాన్ని ఎందుకు అమలు చేయట్లేదన్నారు. కనీసం బడ్జెట్లో ఆ అంశాన్ని ప్రస్తావించినా ఉపయుక్తంగా ఉండేదన్నారు. దేశవ్యాప్తంగా 80 శాతం చిన్నతరహా పరిశ్రమలు కరోనా వల్ల కుదేలయ్యాయనీ, వాటిని పునరుత్తేజం చేయకుండా కంటితుడుపు చర్యలు ప్రకటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వట్లేదనీ, వర్కింగ్ క్యాపిటల్‌తో పాటు కచ్చితంగా ఆస్తులు తాకట్టు పెడితే వాటిపైనే రుణాలు ఇస్తున్నారు తప్ప, ప్రభుత్వపరంగా ఏం ప్రోత్సాహకాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరుగుతున్నాయనీ, వాటిని పట్టించుకోకుండా కేవలం పోర్టల్ అని ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బడ్జెట్‌కు ముందు కనీసం సంబంధిత రంగాల వారితో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదనీ, ఆపనిని కేంద్రప్రభుత్వం చేయలేదన్నారు.