Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం పలు డిమాండ్లను పెట్టింది. బడ్జెట్‌కు ముందు తమ కోరికల చిట్టాను విప్పితే, కేంద్ర ప్రభుత్వం వాటిపై కనీస కనికరం కూడా చూపలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీపై ఫైర్ కావడానికి ఇదే అసలు కారణం. ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీకి స్వయంగా విన్నవించిన అంశాలను కూడా పట్టించుకోకపోవడంతో తన హుందాతనానికి భంగం కలిగినట్టు సీఎం కేసీఆర్ భావించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోరితే కనీసం వాటిలో కొన్నైనా ప్రకటించాలి కదా...అసలు పట్టించుకోకపోవడం ఏంటి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన కోరికలు, కేంద్ర స్పందన ఇలా ఉన్నాయి...
రాష్ట్ర డిమాండ్ కేంద్రం స్పందన రాష్ట్ర డిమాండ్ కేంద్రం స్పందన
బైసన్ పోలో భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి ప్రస్తావనే లేదు
రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలి -పట్టించుకోలేదు
కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు -పెండింగ్
కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్‌కు నిధులివ్వాలి -స్పందన లేదు
23 కొత్త జిల్లాల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయ
స్కూళ్లు పెట్టండి - ప్రస్తావనే లేదు
హైదరాబాద్ - కొత్తగూడెం హైవే పనులు చేపట్టాలి -పెండింగ్
పెద్దపల్లి ఎన్టీపీసీ, ఎరువుల పరిశ్రమల్లో
స్థానికులకే ఉద్యోగాలివ్వాలి -స్పష్టత లేదు
ములుగులో ఏర్పాటు చేసే తెలంగాణ గిరిజన
విశ్వవిద్యాలయంలో స్థానిక గిరిజన విద్యార్థులకు
ప్రయోజనం కలిగేలా చట్టాన్ని మార్పు చేయాలి. -ప్రస్తావనే లేదు
రామప్ప అభివద్ధికి సహకరించాలి -పట్టించుకోలేదు
మిషన్ భగీరథ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలి -నో కామెంట్
బయ్యారంలో స్టీలు ప్లాంటు నిర్మించాలి -స్పందన లేదు
హైదరాబాద్‌లోని చింతల్ హెచ్ఎంటీ
పరిశ్రమను అభివద్ధి చేయాలి -నో కామెంట్
రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారులను నిర్మించాలి -పరిశీలనలో ప్రతిపాదనలు
అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టాలి -పెండింగ్
నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్
జిల్లాలో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పరిశ్రమను పునరుద్ధరించాలి -నో కామెంట్
రాష్ట్రంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్
అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) మంజూరు చేయాలి. -నో కామెంట్
హైదరాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
(ఎన్ఐడి)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో నెలకొల్పాలని
ప్రతిపాదించిన ఎన్ఐడీని రాష్ట్ర పునర్విభజన తర్వాత
విశాఖపట్నానికి తరలించారు -రిప్లరు లేదు
జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు విడుదల చేయాలి -నో కామెంట్
అసెంబ్లీ తీర్మానం మేరకు ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి. -సైలెంట్
పీపీపీ పద్ధతిలో కరీంనగర్లో ఐఐఐటి నెలకొల్పాలి -నో కామెంట్
రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని
వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో
కలపి మొత్తం బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం,
ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. -నో కామెంట్
పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం
రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ
రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. -పెండింగ్
హైదరాబాద్ - నాగపూర్,
వరంగల్ - హైదరాబాద్
ఇండిస్టియల్ కారిడార్‌ను అభివద్ధి పరచాలి -నో బడ్జెట్
వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివద్ధి కోసం
పి.ఎం.జి.ఎస్.వై. ద్వారా రూ. 4వేల కోట్లు కేటాయించాలి -ప్రస్తావన లేదు
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే
రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా,
వందశాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలి -సైలెంట్
సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో
వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి -నో కామెంట్
వరంగల్ టెక్స్టైల్ పార్కు కోసం రూ. వెయ్యి కోట్లను
గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా అందించాలి -ప్రస్తావన లేదు