Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మార్చురీల ఆధునీకరణ పనుల కోసం రూ.32.54 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిధులతో 61 ఆస్పత్రుల్లో పనులు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 113 చోట్ల మార్చురీల్లో అవసరమైన పరికరాలు, ఫ్రీజర్లు, అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమమయినట్టు వెల్లడించారు. నిధుల్లో 10 టీచింగ్ బోధనాస్పత్రులకు రూ.11.12 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 51 దవాఖానలకు రూ. 21.42 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. వైద్యవిధాన పరిషత్తు దవాఖానాల్లో 102 ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులు మంజూరు చేశామనీ, ఇందులో 63 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 20 డీసీఎస్, 19 సీఎస్ పోస్టులు ఉన్నాయి. మరణించిన వారిని తరలించేందుకు ప్రస్తుతం 50 పార్థీవ వాహనాలుండగా మరో 16 నూతన వాహనాలను త్వరలో ప్రారంభించుకోబోతున్నట్టు ప్రకటించారు. మనిషి ఆఖరి మజిలీలో కూడా తగిన గౌరవం లభించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు.