Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పటాన్నీ, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో భీం దీక్ష తలపెట్టామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో ఎంపీలతో కలిసి తాను దీక్షలో పాల్గొంటున్నట్టు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్, నగర కార్పొరేటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. మండల కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బీజేపీ భీం దీక్ష నిర్వహిస్తామని తెలిపారు.