Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా విమర్శ చేశారు. సింగరేణిలో రాష్ట్రానికి 51శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి అద్భుతమైన పురోగతితో, దేశంలోని ఇతర సంస్థల కంటే గొప్పగా లాభాలు సాధించిందనీ, అలాంటి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ, 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందనీ, ఇది సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్దమనీ కామెంట్ చేశారు.