Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాజ్యాంగం జోలికొస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని సీఎం కేసీఆర్‌ను టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివక్షకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంపైనా, రాజ్యాంగంపైనా అవగాహనలేనట్టుగా కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలని అనడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎజెండా, కేసీఆర్ ఎజెండా ఒక్కటేనని ఈ మాటలున్నాయని తెలిపారు. ఆ వ్యాఖ్యలను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలనీ, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.