Authorization
Tue April 08, 2025 04:01:28 pm
- అర్ధశాస్త్ర అధ్యాపకులు పట్టా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కాపాడుకుందామని అర్ధశాస్త్ర అధ్యాపకులు పట్టా వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఈ కాలేజీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీజెడ్సీ, బీఎస్సీ (ఎంపీసీఎస్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఉప్పల్ కలాన్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ కాలేజీ నాలుగు తరగతి గదుల్లో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కంప్యూటర్ కోర్సులున్నా అక్కడ కంప్యూటర్లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. పలు సబ్జెక్టులను బోధించే అధ్యాపకుల్లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీపై దృష్టిసారించి విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించాలని కోరారు.