Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిస్టులు ఇండ్లస్థలాల సమస్యపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో 'జర్నలిస్టుల ఇండ్లస్థలాలు-మన కర్తవ్యం'అనే అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఉదయం 10.30 గంటలకు రౌండ్‌టేబుల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దాదాపు 30 ఏండ్ల నుంచి ప్రభుత్వాల విధానాలు, కోర్టు కేసుల పేరుతో పెండింగ్‌లో పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అదే పరిస్థితి కొనసాగుతున్నదని వివరించారు. రకరకాల సమస్యలతో వందలాది మంది జర్నలిస్టులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు సంక్షోభంలో పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు, హౌజింగ్ సొసైటీలు, సీనియర్ జర్నలిస్టులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.