Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీ బకాయిల చెల్లింపునకు వెంటనే ఉత్తర్వులివ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సీనియర్ సలహాదారులు శివశంకర్‌ను బుధవారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021, ఏప్రిల్, మే పీఆర్సీ బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఇస్తామనీ, 2020, ఏప్రిల్ తర్వాత రిటైరైన ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా ఒకేసారి చెల్లిస్తామంటూ రివైజ్డ్ పేస్కేల్స్ సందర్భంగా (గతేడాది జూన్ 11న) విడుదల చేసిన జీవో నెంబర్ 51లో ప్రభుత్వం పేర్కొందని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ సంబంధిత ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. 2021, ఏప్రిల్, మే పీఆర్సీ బకాయిలు, 2020 ఏప్రిల్ తర్వాత రిటైరైన ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వ్యత్యాసం చెల్లింపుపై వెంటనే ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు. గత ఆగస్టు నుంచి సప్లిమెంటరీ జీతాలు, రీయింబర్స్మెంట్, సెలవు జీతం, జీపీఎఫ్ క్లైములు, ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటినీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పరిష్కరించాలని కోరారు.