Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత్స్య పరిశ్రమ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రూపొందించిన క్యాలెండర్ను బుధవారం మంత్రి అవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల ప్రజలు చేపల కొనుగోలు చేసే విధంగా స్థానికంగా చేపల మార్కెట్ల నిర్మాణానికి కషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లలు రొయ్య పిల్లల పంపిణీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యసంపద విస్తారంగా పెరిగిందన్నారు. దీంతో మత్స్యకారులకు ఉపాధి, ప్రజలకు పోషకాహారం అందుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల.బాలకృష్ణ మంత్రికి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నరసింహ, ఉపాధ్యక్షులు విజరు కుమార్, చనమొని శంకర్ రాష్ట్ర కార్యదర్శి కొప్పు పద్మ అర్వపల్లి శ్రీరాములు, కరెల్లి.లలిత, సంఘం జిల్లా నాయకులు మామిండ్ల జగదీష్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.