Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి బక్క జడ్సన్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు.. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. రజత్ కుమార్ కూతురు వివాహానికి ఫలక్ నుమా ప్యాలెస్, తాజ్ హౌటళ్లలో బిల్లలుకు మెఘా కృష్ణారెడ్డి బినామీ కంపెనీ బిగ్ బెవ్ ద్వారా రూ.50 లక్షలు చెల్లించారని ఆరోపించారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు నోడల్ అధికారిగా పని చేసిన రజత్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. అవినీతిపై బీజేపీ నాయకులు నోరు మెదపకపోవడంతో వారిపై కూడా సందేహాలున్నాయని ఫిర్యాదు చేశారు. వివాహ బిల్లుల చెల్లింపులో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నోడల్ అధికారికి, కాంట్రాక్టర్లకు ఉన్న సంబంధమేంటో వాటిని పరిశీలిస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తో సన్నిహిత సంబంధాలున్న రజత్ 25 లక్షల మంది అర్హులైన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఆయన్ను కాళేశ్వర్ ప్రాజెక్టు అధికారిగా నియమించారని విమర్శించారు.