Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలంటున్నారో స్పష్టత ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. హిందుత్వ ఎజెండాయే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తున్నాయనీ, ఈ క్రమంలో కేసీఆర్ దాన్ని ఎందుకు మార్చాలంటున్నారో వివరణ ఇవ్వాలని కోరారు. బుధవారం జరగిన కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి ఆన్లైన్ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించారు. పైకి ఎన్నిమాటలు చెప్పినా..ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాల మాటున రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా అర్థమవుతోందని తెలిపారు. రాజ్యాంగంలోని ఏ అంశాలు పనికి రాకుండా ఉన్నాయో తేల్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహారించుకోవాలని పేర్కొన్నారు.
సీఎం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు:ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని బీఎస్పీ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ హైదరాబాద్ అధ్యక్షులు రుద్రవరం సునీల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగాలతో రాజ్యాంగం ఏర్పడిందన్నారు. మనది ప్రపంచంలోనే ఉన్నతమైన రాజ్యాంగమన్నారు. ముఖ్యమంత్రి తన ఆస్తులు, కమిషన్లను పెంచుకునేందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని విమర్శించారు.