Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముడి ఇనుము ఉత్పత్తిలో భారతదేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) జనవరిలో రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించింది. ఈ మేరకు ఆ సంస్థ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది జనవరిలో ఉత్పత్తి 3.86 మిలియన్ టన్నులుండగా ఈ ఏడాది అది 4.56 (18.14 శాతం అధికం) మిలియన్ టన్నులకు పెరిగింది. గత జనవరిలో విక్రయాలు 3.74 మిలియన్ టన్నులుండగా, ఇప్పుడు 4.24 (13.4 శాతం అధికం) మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. జనవరి వరకు 10 నెలల్లో ఉత్పత్తి 25.66 మిలియన్ టన్నులు నుంచి 32.88 (28.14 శాతం అధికం), 10 నెలల విక్రయాలకు సంబంధించి 26.01 మిలియన్ టన్నుల నుంచి 32.60 మిలియన్ టన్నులకు చేరింది.
అభినందనలు....సుమిత్ దెబ్
ఆకట్టుకునే పనితీరును ప్రదర్శించిన సిబ్బందికి ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దెబ్ అభినందనలు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు వెచ్చించే ఖర్చులను పెంచేందుకు కేంద్ర బడ్జెట్ భరోసా ఇవ్వడం ఈ ఏడాది శుభపరి ణామంగా కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఉక్కు ఉత్పత్తిలో 2021 సంవత్సరానికి భారతదేశం 18 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ ఈ వృద్ధిని కొనసాగించేందుకు బలమైన పునాదిని వేసిందని పేర్కొన్నారు.