Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ప్రగతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రస్తుత ఏడాదిలో రూ.15 వేల కోట్ల వ్యాపారాన్ని చేసి రూ.117 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆ బ్యాంకు చైర్మెన్ టి.కామేశ్వర్ రావు తెలిపారు. బుధవారం ఆయన బ్యాంకు 227వ శాఖను నర్సరావుపేటలోని లింగంగుట్లలో ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల తరహాలోనే అన్ని రకాల రుణాలు, డిజిటల్ సేవలను అందిస్తున్నదని చెప్పారు. డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకేనని వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట రీజినల్ మేనేజర్ ఎం.శ్రీనివాస రెడ్డి, లింగంగుట్ల బ్రాంచ్ మేనేజర్ ఎస్.వెంకటేష్,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.