Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అందిస్తున్న జీవన్ అక్షరు (ప్లాన్ 857), న్యూ జీవన్ శాంతి (ప్లాన్ 858)లలో మార్పులు చేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్లాన్ల కొత్త అన్యూటీ ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తమ వెబ్సైట్, యాప్ల్లోని క్యాలుక్లేటర్ ద్వారా ప్రీమియం ధరలను పరిశీలించుకోవచ్చని తెలిపింది. సమీక్షించిన ఈ పాలసీలను తమ చానల్ కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (సీపీఎస్సీ-ఎస్పీవీ) లేదా ఇతర తమ డిస్ట్రిబ్యూషన్ చానల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.