Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు డివిజన్ బెంచ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ ఎగ్జామ్స్ పేపర్లను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆమోదించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ యూనివర్సిటీ వేసిన అప్పీల్ పిటిషన్‌ను బెంచ్ కొట్టేసింది. మారిన సాంకేతికతకు అనుగుణంగా మూల్యాంకనం చేయాలనీ, పాత విధానం సరికాదనీ, దీని వల్ల తాము ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యామని డాక్టర్ దేవేందర్ బనావత్ సహా 12 మంది వేసిన కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వులను బెంచ్ సమర్ధించింది. స్క్టెలస్ వాడుతూ డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయాలనీ, ఎక్స్, టిక్ మార్కులను వాడాలన్న ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది.