Authorization
Sat April 05, 2025 05:45:52 pm
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎంఎల్టీ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ వేతనాలను పెంచినందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్ నేతృత్వంలో నాయకులు మంత్రిని కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.17 వేల వేతనాన్ని సరి చేసి, రూ.21 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. 30 శాతం పీఆర్సీ పెంపుదల జీవో ప్రకారం ఒక్కో ఎన్ హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్ రూ.27,300 వేతనం అందుకుంటారని వెల్లడించారు. ప్రభుత్వం వేతనాన్ని పెంచిన నేపథ్యంలో మరింత కష్టపడి పని చేస్తామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ ఎన్హెచ్ఎం విభాగం రాష్ట్ర అధ్యక్షులు కవ్వం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర నరేష్, కోశాధికారి కళ్ళు తిరుమల్ రెడ్డి, నాగరాజు, రంజిత్, సమి, ఆనంద్, శ్రీకాంత్ తదితరులున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమాజాన్ని కాపాడటంలో ఉండటానికి ల్యాబ్ టెక్నీషియన్లు చేసిన కృషి కీలకమని అభినందించారు.