Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరీ ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో గల మంత్రుల నివాస సముదాయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసే రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్స్, అకౌంట్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 97.97 శాతం పనిదినాలు పూర్తయ్యాయన్నారు. మరో 2 కోట్ల పని దినాలకు కూడా అనుమతి లభించిందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.3,498.40 కోట్ల వ్యయం చేశామనీ, కూలీలకు 2,381 కోట్లు చెల్లించామని వివరించారు. గ్రామాలలో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు రూ.1,065.60 కోట్ల విలువైన పనులను మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో చేపట్టామని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఉపాధి హామీ ఉద్యోగులు చట్టం అమలుకు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఉపాధి హామీకి రూ.73 వేల కోట్లే కేటాయించడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కంప్యూటర్ ఆకౌంట్స్,అసిస్టెంట్ ప్రెసిడెంట్ రఫీ సయ్యద్, ప్రధాన కార్యదర్శి విజరు, జాయింట్ సెక్రెటరీలు రఘు, సుధీర్ రెడ్డి, వెంకటేష్, రాష్ట్ర ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ సంజీవ్, ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్లో హన్మకొండ రికార్డు : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో 15 నుంచి 17 ఏండ్ల మధ్య వయస్సు వారికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తొలి జిల్లాగా హన్మకొండ రికార్డు సృష్టించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా వైద్యారోగ్య అధికారిని, జిల్లా అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. జిల్లాలో 55 వేల 694 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యాన్ని అధిగమించి 56 వేల 291 మందికి (101%) వ్యాక్సిన్లు వేశారని తెలిపారు.