Authorization
Wed April 09, 2025 12:38:45 am
- రెండోరోజు 42.28 శాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బడులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. రెండోరోజు బుధవారం 42.28 శాతం మంది విద్యా ర్థులు హాజరయ్యారు. తొలిరోజు మంగ ళవారం రాష్ట్రవ్యాప ్తంగా 55,11,602 మంది విద్యార్థులకుగాను 17,89,809 (32.47 శాతం) మంది విద్యార్థులు బడులకు హాజరైన విషయం తెలిసిందే. తొలిరోజు కంటే రెండోరోజు 9.81 శాతం మంది విద్యార్థుల హాజరు పెరగడం గమనార్హం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన వివరాలు ప్రకటించారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సాధారణ గురుకుల విద్యాసంస్థల్లో 24,29,540 మంది విద్యార్థులకుగాను, 10,74,918 (44.24 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. ఎయిడెడ్ స్కూళ్లలో 81,205 మంది విద్యార్థులకుగాను, 27,481 (33.84 శాతం) మంది వచ్చారని తెలిపారు. ప్రయివేటు స్కూళ్లలో 30,31,193 మంది విద్యార్థులకుగాను, 12,40,806 (40.93 శాతం) మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని పేర్కొన్నారు.