Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చిందనీ, దాన్ని సాహిత్య అకాడమీ తిరిగి పునర్ముద్రణ చేయాలని శాసన మండలి సభ్యులు బండ ప్రకాశ్ కోరారు. మంగళవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో చైర్మెన్ జూలూరు గౌరీశంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నిఘంటువు నిర్మాణాలపై చర్చించారు. వందల దశాబ్ధాల క్రితం తంజావూరు పబ్లికేషన్స్ పేరున ఓరుగల్లు నిఘంటువును ముద్రించారనీ, వరంగల్ ప్రాంతంలో ఇప్పటికీ వెలుగు చూడని తరతరాల జానపద సాహిత్య జన చరిత్రను వెలుగులోకి తీసుకు రావాలని కోరారు. పోతన పీఠం, రాజరాజ నరేంద్ర గ్రంధాలయాలను శక్తివంతం చేయడం, పాల్కురికి సోమనాధుని సమగ్ర సంకలనాలు వెలుగులోకి తేవాలని చెప్పారు. దీనిపై చైర్మెన్ సానుకూలంగా స్పందించారు. ఓరుగల్లు నిఘంటువును తిరిగి ముద్రిస్తామనీ, అయితే అది ప్రస్తుతం అందుబాటులో లేదనీ, కర్నూలు కలెక్టరేట్ ఇన్టాక్ గ్రంధాలయ విభాగంలో ఉన్నట్టు సమాచారం ఉందనీ, దీనికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నామని తెలిపారు.