Authorization
Sat April 05, 2025 02:02:29 pm
- కనీసం 5% వాటా విక్రయానికి రంగం సిద్ధం : దీపమ్ సెక్రటరీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఒ) కోసం ఉద్దేశించిన ప్రతిపాదనల పత్రాలను కేంద్రం సెబీకి సమర్పించనుందని దీపమ్ సెక్రటరీ తూహిన్ కాంత పాండే వెల్లడించారు. వచ్చే వారం ముగింపులోపే ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చన్నారు. కాగా.. ఇందులో కనీసం 5శాతం వాటాలను విక్రయించే అవకాశం ఉందన్నారు. విక్రయ స్థాయి నిర్ణయాన్ని బట్టి పెద్ద మొత్తంలోనే షేర్లు ఉండొచ్చన్నారు. దేశంలో ఇది వరకు ఎప్పుడూలేని పెద్ద ఐపీఓగా ఉంటుందన్నారు. వచ్చే మార్చిలోనే ఐపీఓ ఉంటుందన్నారు. ఎల్ఐసీ ఐపీఓ కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనల మార్పునకు త్వరలోనే క్యాబినెట్ ఆమోదం తెలుపనుందని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సెక్రటరీ అనురాగ్ జైన్ మరో ఇంటర్యూలో తెలిపారు. పలు అంశాలపై అంతర్జాతీయ సంస్థలతో తుది సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రయివేటు బీమా కంపెనీల్లో మాత్రమే 74 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇది ఎల్ఐసీకి వర్తించదు. దీని కోసం ఎల్ఐసీ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంది.