Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్ఏటీఎస్)కు చెందిన షూటింగ్ రేంజ్లో గత ఐదేండ్లుగా షూటింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారిణి రాపోలు సురభి భరత్వాజ్ను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో గురువారం అభినందనందించారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా విధానాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురభి భరత్వాజ్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.