Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరస్పర బదిలీల జీవో 21ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ఇంటర్ లోకల్ క్యాడర్ (అంతర్జిల్లా) పరస్పర బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలన్ని స్వాగతించారు. అయితే ఈ బదిలీ అభ్యర్థుల్లో కనీసం ఒక్కరైనా పీవో-2018 ప్రకారం బదిలీ అయి ఉండాలని నిబంధన విధించడం సరైంది కాదని తెలిపారు. వేర్వేరు పూర్వజిల్లాల్లో నియామకమైన ఉపాధ్యాయు లు వారి కుటుంబ అవసరాల కోసం పరస్పర బదిలీల ద్వారా ఇతర జిల్లాలకు వెళ్లిన వారు 2012 నుంచి అంతర్జిల్లా బదిలీల కోసం ఎదురుచూస్తున్నా రని పేర్కొన్నారు. ఈ నిబంధన కారణంగా వారికి పరస్పర బదిలీకి అవకాశం దక్కకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరస్పర బదిలీ కోరుకుంటే సీనియార్టీ జాబితాలో చివరి ర్యాంకు తీసుకోవాలని నిబంధన విధించడం సరైంది కాదని తెలిపారు. వేర్వేరు పూర్వపు యూనిట్లలో నియామకమై, వేర్వేరు నూతన యూనిట్లకు బదిలీ అయిన వారికే ఆ నిబంధన వర్తింపచేయాలని సూచించారు. ఒకే పూర్వపు యూనిట్లో నియామకమై అదే పూర్వపు యూనిట్ పరిధిలోని నూతన యూనిట్‌కు బదిలీ అయిన వారికి సీనియార్టీ మొత్తం లెక్కించాలని కోరారు. అలా జీవో 21కి తగిన సవరణ చేసి ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వారు లేఖ రాశారు.