Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
'ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లోని ఎల్ఐసీని అమ్మడం దారుణమని విమర్శించారు. దేశమంటే మట్టి మాత్రమే కాదనిపేర్కొన్నారు. ఎల్ఐసీని అమ్మేస్తే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే కుటుంబాల పరిస్థితేంటని నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.