Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఇదే అంశంపై గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మెన్ ప్రీతం ఆధ్వర్యంలో 48గంటల దీక్షను చేపట్టారు. రాజ్యాంగాన్ని మార్చడమంటే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు మార్చినంత ఈజీ కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం ముగించనున్న దీక్షలో ఆ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.
భారత రాజ్యాంగాన్ని కించపరించిన కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో గురువారం గాంధీభవన్ ముందు సీఎం కేసీఆర్ బొమ్మకు దహన సంస్కార కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జి చిన్నారెడ్డి, కోదండరెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మల్లురవి, పొన్నాల లక్ష్మయ్య, అద్దంకి దయాకర్, మానవతరారు, బొల్లుకిషన్, ముత్తినేని వీరయ్యతోపాటు వివిధ జిల్లాలకు చెందిన దళిత కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
సామాజిక అన్యాయానికి నిరసనగా
తొమ్మిదిన గాంధీభవన్ వద్ద 'ఆవేదన దండోరా'
కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజికతరగతికి అన్యాయం జరుగుతున్నదని ఆ పార్టీకి చెందిన నేతలు దేవని సతీష్‌మాదిగ, కొండేటి మల్లన్న, విజరుకుమార్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈనెల తొమ్మిదిన గాంధీభవన్ ముందు 'ఆవేదన దండోరా' వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.