Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు పార్టీ అగ్రనేత,దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ బెటాలియన్ కమాండర్ మాండవి ఎలియాస్ ఎడిమాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎడిమా ను తెలంగాణలో సీఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారని ప్రభుత్వం ఉద్దేశపూ ర్వకంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. నిజానికి ఎడిమా దండకారణ్యంలోనే పార్టీ శ్రేణులు, సానుభూతిపరుల మధ్య ఉంటూ పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్వీర్యం చేయడానికి, సానుభూతిపరులు, అభిమా నులను గందరగోళ పర్చడానికి లేని అరెస్టులను సృష్టించి వ్యూహాత్మక దాడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు.ఇలాంటి దుర్మార్గపు చర్యలను తమ పార్టీ కార్యకర్తలు విశ్వసించబోరని పేర్కొన్నారు.సానుభూతిపరులు కూడా ఇటువంటి ప్రభుత్వ ఎత్తుగడలపై అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.