Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతి పత్రాలు అందుకున్న ఆరె కుల సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆత్మగౌరవ భవనాలపై బీసీల్లో మంచి స్పందన వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఏక సంఘంగా ఏర్పడిన ఆరె కుల సంక్షేమ సంఘం నేతలకు ఆత్మగౌరవ భవనం కోసం ఉప్పల్ బగాయత్‌లో కేటాయించిన ఎకరా భూమికి అనుమతి పత్రాన్ని హైదరాబాద్‌లో ఆయన అందజేసారు. ఈ సందర్భంగా సంఘం నేతల్ని అభినందించిన మంత్రి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించుకోవాల్సిందిగా సూచించారు. ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్సులు సి.హెచ్. శివాజి, ఆత్మగౌరవ భవనం కమిటీ సభ్యులు దుక్కిడి నాగేశ్వర్ రావు, ఇరువాడి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం క్యాలండర్ ఆవిష్కరణ
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్‌ను మంత్రి గంగుల కమలాకర్ గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి నరెేందర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి, రాష్ట్ర కో ఆర్డినేటర్ టి రాజ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్, బీసీ రాష్ట్ర యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.