Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో ప్రధాన మంత్రి పర్యటన ఉండడంతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించతలపెట్టిన మహాధర్నా ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ టి విజయసాగర్ అధ్యక్షతన వర్చువల్ పద్ధతిలో గురువారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. అనంతరం కె జంగయ్య, చావరవి, కె రమణ, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, డి సైదులు, షౌకత్అలీ, మంగ, జాడి రాజన్న, ఎన్ యాదగిరి, బి కొండయ్య, ఎస్ మహేష్, శాగ కైలాసం, చింత రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలంటూ కోరుతూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో గతనెల 29న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయని వివరించారు. 317 జీవోపైన, ఉద్యోగుల ఉద్యమంపైన సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.