Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం దృష్టికి తీసుకుపోతా..:ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
- లకీëనరసింహా స్వామికి కిలో బంగారం విరాళం
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, ఆరోగ్య, ఇతర శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ఆస్పత్రి విషయాన్ని మంత్రికి చెప్పడంతో పైవిధంగా ఆయన స్పందించారు. గురువారం మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా యాదాద్రిని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విమాన గోపురానికి మంత్రి కిలో బంగారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గం తరపున విమానం గోపురం బంగారు తాపడానికి ఇంకో కేజీ బంగారం విరాళం అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయం విరాజిల్లనుందన్నారు. ప్రధానాలయ ఉద్ఘాటన మార్చి నెలలో చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయిచిన విషయాన్ని గుర్తు చేశారు. యాదాద్రి చుట్టు పక్కల ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందడం హర్షణీయమన్నారు. మంత్రి వెంట ఆలయ ఇన్చార్జి ఈవో గీత, కలెక్టర్ పమేలా సత్పతి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి తదితరులు ఉన్నారు.