Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఇందిరానగర్‌లో 'డబుల్' ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
హైదరాబాద్ నగరంలో పేదల కోసం నిర్మిస్తున్న రెండు పడకల గదుల నిర్మాణాలు దేశంలో మరెక్కడా, ఏ మహానగరంలో పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ కాలనీలో రూ.17.85 కోట్లతో చేపట్టిన 210 ఇండ్లను హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కమిషనర్ లోకేష్‌కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో చెన్నై, కలకత్తా, ముంబయి, బెంగళూరు మహానగరాల్లోనూ పేదలకు ఇలాంటి గృహాలు నిర్మించలేదన్నారు. ఇందిరానగర్ లబ్దిదారుల ఎన్నో ఏండ్ల్ల కల ఈ రోజు నెరవేరిందన్నారు.నగరంలో రూ.9714కోట్లతో పేదలకు రెండు పడకల గదుల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. ఇందిరానగర్ కాలనీ సిటీ సెంట ర్లో ఉందని, ఇక్కడ చుట్టుపక్కల హుస్సేన్‌సాగర్, నూతనంగా నిర్మించే 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్ ఉండ టంతో ఒక్కో ప్లాట్ రూ.50 నుంచి రూ.60లక్షలకుపైగా ఉంటుందని తెలిపారు. ఇందిరా నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు, లిఫ్ట్‌తో పాటు తాగునీరు, నిర్వహణ కోసం షాపులు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు.షాపుల ద్వారా వచ్చే ఆదాయంతో కాలనీ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. లిఫ్ట్, పరిసరాల పరిశుభ్రత పచ్చ దనం ఉండాలని,అందుకు యువకులు ముందుకు రావాలని అన్నారు.