Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.527 మనీయార్డర్ పంపిన బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీనియర్ ఐఏఎస్ అధికారి రజతకుమార్ విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ గడిలో ఎంతో మంది అవినీతి ఐఏఎస్ అధికారులు ఉన్నారని చెప్పారు. రజత్‌కుమార్ లాంటి అవినీతి ఐఏఎస్ అధికారి ఇంటి శుభకార్యాల సహాయార్థం తాము భిక్షాటన చేసి రూ. 517ల మనియార్డర్ పంపించామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్, పబ్లిక్ గార్డెన్ ముందు రజత్‌కుమార్ విలాసాలు తీర్చడం కోసం భిక్షాటన చేపట్టారు. ' ఏఐఎస్ అధికారులు అవినీతికి పాల్పడొద్దు. మీకు డబ్బు కావాల్సినప్పుడల్లా మాకు చెప్పండి. తాము బిక్షాటన చేసి, మీ విలాసాలకు కోసం డబ్బు పంపిస్తాం' అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజరుకుమార్, జాన్, సుధాకర్, అయిత గిరిబాబు, కటురి రమేశ్ తదితరులు పాల్గన్నారు.