Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల పదో తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆలస్య రుసుం లేకుండా ఈనెల పదో తేదీ వరకు చెల్లించేందుకు గడువుందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.200తో ఈనెల 16వ తేదీ వరకు, రూ.వెయ్యితో 23 వరకు, రూ.రెండు వేలతో మార్చి రెండు వరకు ఫీజు చెల్లింపునకు అవకాశముందని వివరించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నుంచి ఫీజు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్లో వార్షిక పరీక్షలుంటాయని తెలిపారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గతేడాది అక్టోబర్లో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారని వివరించారు. వారు ఫస్టియర్ సబ్జెక్టులకు ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు.