Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరపడాన్ని, దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.