Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గన్‌పార్కు వద్ద నిరసనలో ఇందిరాశోభన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో కొనసాగుతున్న దోపిడీని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, నాంపల్లి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఇందిరాశోభన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును మార్చి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏడేండ్లుగా రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు నీళ్లు తరలించేందుకే మల్లన్నసాగర్ ప్రాజెక్టును సష్టించి 14 గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని చెప్పారు. భూములు లాక్కొని నష్టపరిహారం ఇవ్వకుండా నిర్వాసితులను వేధించిన ఘనత టీఆర్ఎస్ సర్కార్‌దేనన్నారు. కేసీఆర్‌ను జైల్లో పెడతామంటూ బీజేపీ నేతలు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని చెప్పారు.ఆ పార్టీని విమర్శిస్తే ఈడీ, సీబీఐ పేరుతో బెదిరిస్తున్న ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై ఎందుకు వాటిని ప్రయోగించడం లేదని నిలదీశారు. ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు స్వతంత్ర న్యాయమూర్తలతో విచారణ జరిపించాలని ఆప్ నేత సోమనాథ్ భారతి డిమాండ్ చేశారు.