Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ అనేది ఒక దుర్మార్గపు పార్టీ అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. దళిత జాతికి ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని బేగంపేటలోగల తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశానికి కొత్త రాజ్యాంగం కావాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థించారు. ఈ అంశంపై బీజేపీ నానా గోల చేస్తోందని విమర్శించారు. అది కరుడుగట్టిన మతోన్మాద పార్టీ అని చెప్పారు. బీజేపీ నేతలు మతం గురించి మాట్లాడకుండా ఒక్కరోజైనా ఉండగలరా..? అని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్న ఆ పార్టీ నాయకులకు రాజ్యాంగ మార్పుపై వాజ్పేయి ప్రభుత్వం కమిటీ వేసిన విషయం గుర్తు లేదా..? అని ప్రశ్నించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటూ చెప్పలేదా..? అని ప్రశ్నించారు. జైం భీమ్ అని నినదింటానికి, అంబేద్కర్ విగ్రహాలను తాకే నైతిక అర్హత బీజేపీ నాయకలకు లేదని ఎద్దేవా చేశారు.