Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇ- కామర్స్ రంగంలోని నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా సొంత బ్రాండ్లను పరిచయం చేస్తోన్నట్లు వెల్లడించింది. బంగారం, వెండి నాణేలు, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్యం, ఫిట్నెస్, హౌమ్, కిచెన్, జీవనశైలి ఉత్పత్తులను తమ ప్రయివేటు లేబుల్‌లో ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటాక్లిక్, లైఫ్108.స్టోర్ వంటి పోర్టల్స్‌లో ఇవి లభిస్తాయని నిహార్ ఇన్ఫో గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ బి దివ్యేశ్ నిహార్ తెలిపారు. మార్చిలోగా 150 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 75 శాతం అధికమైందన్నారు.