Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి, మరొకరు గల్లంతు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
ప్రమాదవశాత్తు చెక్‌డ్యామ్‌లో జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ డివిజన్ ఫతేనగర్‌కు చెందిన దండు కిరణ్, మహేష్, సుధాకర్ (21), హరీష్ (21)తో పాటు మరో ఇద్దరమ్మాయిలు మొత్తం ఆరుగురు కలిసి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, సంఘీ టెంపుల్‌కు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి గండి చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని చెక్‌డ్యామ్ సందర్శనకు వచ్చారు. అక్కడ స్నేహితులతో కలిసి సుధాకర్, హరీష్ చెక్‌డ్యామ్‌పై నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా అదుపుతప్పి నీళ్లలో పడిపోయారు. వెంటనే అక్కడున్న కొందరు స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలి చేరుకున్న సిబ్బంది.. ఆ ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. హరీష్ మృతదేహం లభ్యమైంది. మరో యువకుడు సుధాకర్ కోసం గాలింపు కొనసాగుతున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.