Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు బండి సంజరు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు శనివారం ఒక ప్రకటనలో ఖండించారు.కేసీఆర్కు ఇది సంస్కారం కాదని తెలిపారు.80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఞానం ఏమైపోయిందని ప్రశ్నించారు.ప్రధాని రాష్ట్రానికి వచ్చినా సీఎంకు రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందో చెప్పాలన్నారు.మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని గుర్తుచేశారు.కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవటం సరికాదని విమర్శించారు.